Share News

దోర్నాలలో గిరిజనుల ప్రసూతి వార్డు ప్రారంభం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:41 AM

స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రం లో నూతనంగా నిర్మించిన చెంచుగిరిజన ప్రసూతి వార్డును ఎర్రగొండపాలెం నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు శనివారం ప్రారంభించారు.

దోర్నాలలో గిరిజనుల  ప్రసూతి వార్డు ప్రారంభం

పెద్దదోర్నాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రం లో నూతనంగా నిర్మించిన చెంచుగిరిజన ప్రసూతి వార్డును ఎర్రగొండపాలెం నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు శనివారం ప్రారంభించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ మండలంలోని గిరిజన గర్భిణులకు ఈ వార్డు ఎంతో ఉప యుక్తంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సంజీవ్‌, ఆంజనేయులు, ఆరోగ్యమిత్రలు మణికుమార్‌, చంద్రశేఖర్‌, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

బాలికల వసతిగృహం సందర్శన

స్థానిక గిరిజన బాలికల వసతిగృహాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు శనివారం పరిశీలించారు. వసతి గృహంలోని గదులు, పరిసరాలు నిశితంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మా ట్లాడారు. వ్యక్తిగత శుభ్రతను పాటించాలని అదేసమయంలో పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షలు బాగా రాయాలని, అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలని సూచించారు. అనంతరం హాల్‌ టిక్కెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, కూటమి మండల నేతలు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:41 AM

News Hub