Share News

బిల్లుల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:45 PM

దర్శి నగర పంచా యతీలో చేసిన పనులకు ఎంతోకాలంగా బిల్లులు రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.2 కోట్లకుపైగా చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌ లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అసం బద్ధ నిర్ణయంతో నగర పంచాయతీలో నిధులు ఉన్నా ఇచ్చేందుకు వీలులేకుండా పోయింది. సుమారు ఏడా దిన్నరగా చేసిన పనులకు బిల్లులు విడుదల కాక నిర్వా హకులు అల్లాడుతున్నారు.

బిల్లుల కోసం ఎదురుచూపులు

దర్శిలో రూ.2 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌

ఇబ్బందులు పడుతున్న నిర్వాహకులు

వైసీపీ నిర్వాకంతో అవస్థలు

దర్శి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): దర్శి నగర పంచా యతీలో చేసిన పనులకు ఎంతోకాలంగా బిల్లులు రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.2 కోట్లకుపైగా చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌ లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అసం బద్ధ నిర్ణయంతో నగర పంచాయతీలో నిధులు ఉన్నా ఇచ్చేందుకు వీలులేకుండా పోయింది. సుమారు ఏడా దిన్నరగా చేసిన పనులకు బిల్లులు విడుదల కాక నిర్వా హకులు అల్లాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నగర పంచాయతీ, మున్సిపాలిటీల్లో నిధుల డ్రా చేసే వీలులే కుండా ఫీజింగ్‌ విధించటంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం పనులు చేసేందుకు నిర్వాహకులు ముందుకు రావటం లేదు.

దర్శి నగర పంచాయతీలో రూ.5 కోట్లకు పైగా ని ధులు ఉన్నాయి. గత ప్రభుత్వం విధించిన ఫీజింగ్‌తో ఆ నిధులు వాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా బిల్లులు వస్తాయనే ధీమాతో ఇటీవల కాలంలో అనేకమంది పనులు చేశారు. బిల్లుల మంజూరుకు పనులుచేసిన నిర్వాహకులు ఎదురుచూ స్తున్నారు.

ఈ విషయంపై దర్శి నగర పంచాయతీ కమిషనర్‌ వై.మహేశ్వరరావును వివరణ కోరగా.. చేసిన పనులకు రూ.2 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. గత పభుత్వం విధించిన ఫీజింగ్‌తో బి ల్లులు చెల్లించే వీలులేకుండా పోయిందని చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. నగర పంచాయతీ, మున్సిపాలి టీల్లో నిధులను అక్కడ అభివృద్ధి పనులకు వాడుకునేం దుకు త్వరలో జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నా రు. ఆ ఉత్తర్వులు అందిన వెంటనే పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

దర్శి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): దర్శి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చ య్య, కమిషనర్‌ వై.మహేశ్వరరావు మంగళ వారం పరిశీలించారు. 20వ వార్డు పరిధిలో ఉన్న చింతలపాలెంలో ఇప్పటివరకు సింగల్‌ ఫేస్‌ విద్యుత్‌ సరఫరా కల్పిస్తున్నారు. నగర పంచాయతీలో అనుసంధానమైన ఆ వార్డు కు కూడా త్రీఫేస్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పిం చేందుకు వీలుగా స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులను వారు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ అంకబాబు, కౌన్సిలర్‌ కనకం శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు నక్క రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:45 PM