యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:23 PM
యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని టీడీపీ యువనేత గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. పట్టణంలోని రాజీవ్ కాలనీలో తెలుగుయువత ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా జిల్లా స్థాయి టెన్ని్‌సబాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివా రం హర్షవర్దన్ ప్రారంభించారు.
అద్దంకి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని టీడీపీ యువనేత గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. పట్టణంలోని రాజీవ్ కాలనీలో తెలుగుయువత ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా జిల్లా స్థాయి టెన్ని్‌సబాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివా రం హర్షవర్దన్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. 10రోజులపాటు జరిగే టోర్నమెంట్‌లో జిల్లాలోని 43 టీమ్‌లు పాల్గొననున్నాయి. కార్యక్రమం లో సీఐ సుబ్బరాజు, టీడీపీ నేతలు కాకాని అశోక్, గార్లపాటి శ్రీనివాసరావు, వడ్డవల్లి పూర్ణచం ద్రరావు, కౌన్సిలర్‌లు, నేతలు పాల్గొన్నారు.