Train Services: నాలుగు రైళ్లు రద్దు
ABN , Publish Date - Jan 11 , 2025 | 03:24 AM
కీలకమైన రద్దీ సమయంలో విజయవాడ - విశాఖపట్నం మధ్యన రెండు రోజుల పాటు ముఖ్యమైన షెడ్యూల్ సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది.
విజయవాడ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): కీలకమైన రద్దీ సమయంలో విజయవాడ - విశాఖపట్నం మధ్యన రెండు రోజుల పాటు ముఖ్యమైన షెడ్యూల్ సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. వందే భారత్‌కు డిమాండ్ పెంచుకోవటంలో భాగంగానే రైల్వే ఈ నిర్ణయం తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆటోమేటిక్ సెక్షన్ పనులేవీ వందేభారత్ అడ్డురాకపోవడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20834/20833)కు 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 14 చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన నాలుగు రైళ్ల స్థానంలో వందేభారత్ వైపు ప్రయాణికులను ఆకర్షించటం కోసం చైర్ కార్ కోచ్‌లను 18కి పెంచింది. అదే సమయంలో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని జనసాధారణ్ రైళ్లను చర్లపల్లి - విశాఖపట్నం మధ్యన నడుపుతున్నట్టు ప్రకటించింది. నాలుగు రైళ్లను రద్దు చేసి, మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే ప్రకటించడం వెనుక ప్రయాణికుల ప్రయోజనాలు ఏమేరకు ఇమి డి ఉన్నాయన్న ప్రశ్నకు అధికారులే సమాధానం చెప్పాలి.