Share News

రేపు రామలింగేశ్వరుడి రథోత్సవం

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:33 PM

రాంపురం రామలింగేశ్వరస్వామి మహా రథోత్సవం 15న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

రేపు  రామలింగేశ్వరుడి రథోత్సవం
రాంపురంలో ముస్తాబైన రామలింగేశ్వర స్వామి ఆలయం

మంత్రాలయం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాంపురం రామలింగేశ్వరస్వామి మహా రథోత్సవం 15న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మంత్రాలయం మండలంలోని రాంపురం గ్రామం తుంగభద్ర నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వరస్వామి వేడుకలు కన్నులపండువగా ప్రారంభం కానున్నాయి. స్థానిక ప్రజలతో పాటు రాష్ట్ర నలమూలల నుంచే కాక తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.

భారీగా ఏర్పాట్లు : రామలింగేశ్వరస్వామి మహా రథోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు రాంపురం రెడ్డి సోదరులు టీటీడీ పాలకమంలి మాజీ సభ్యుడు సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మంత్రాలయం సొసైటీ మాజీ అధ్యక్షుడు ప్రదీ్‌పరెడ్డి, భీమా యూత నాయకులు ధరణీధర్‌రెడ్డిల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు. అంతేకాకుండా రథోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఆదోని, గుంతకల్‌ మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, వెంకటరామిరెడ్డిలతో పాటు ఆంధ్ర, కర్ణాటకకు చెందిన పలువురు పీఠాధిపతులు రానున్నారు.

ఫ బుధవారం రామలింగేశ్వరస్వామి మహోరథోత్సవం వైభవంగా జరగనుంది. రాంపురెడ్డి సోదరుల ఇంటి నుంచి పల్లకిలో ఉత్సవమూర్తిని ఆలయం వరకు ఊరేగించి ప్రత్యేపూజలు చేసి మహారథంపై అధిష్టించి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోరవయ్యలు, కళాకారులు కోలాటాలు, నందికోళ్ల నృత్యాలు, భజన మండళ్లుసేవలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, మంత్రాలయం సీఐ రామాంజులు, మంత్రాలయం, మాధవరం ఎస్‌ఐలు పరమే్‌షనాయక్‌, విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 11:33 PM