జిల్లా ఆస్పత్రి నుంచి రెఫరల్ కేసులు తగ్గించాలి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:00 AM
మదనపల్లె జిల్లా ఆస్పత్రి నుంచి రెఫరల్ కేసులు తగ్గించాలని 108 ఆఫరేష న ఎగ్జిక్యూటివ్ నాగభూ షణం ఆధ్వర్యంలో సిబ్బం ది ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ కోటేశ్వర మ్మకు మంగళవారం వి నతిపత్రం అందించారు.
మదనపల్లె అర్బన, జన వరి 7(ఆంధ్రజ్యోతి): మదనపల్లె జిల్లా ఆస్పత్రి నుంచి రెఫరల్ కేసులు తగ్గించాలని 108 ఆఫరేష న ఎగ్జిక్యూటివ్ నాగభూ షణం ఆధ్వర్యంలో సిబ్బం ది ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ కోటేశ్వర మ్మకు మంగళవారం వి నతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె జిల్లా ఆస్పత్రికి నుంచి ప్రతి ఒక చిన్న రోగిని తిరుపతికి రెఫర్ చేయడంతో మండలంలో 108 వాహనం అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు అందుబా టులో లేకుండా పోతుందని వాపోయారు. ఇటీవల కురుస్తున్న పొగమంచు కారణంగా 108 వాహనాలు నడపడానికి రోడ్డు కనిపించక చాలా ఇబ్బందు లు ఎదర్కొంటున్నామని తెలిపారు. మూడు రోజుల క్రితమే చంద్రగిరి మండలం మంగాపురం వద్ద పొగమంచు కారణంగా రోడ్డు దాటుతున్న వేంకటేశ్వర మాలదారులు ఇద్దరు ప్రమాదంలో చనిపోవడం జరిగించదని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెఫరల్ కేసు లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 108 సిబ్బంది యశ్వంత, సూరిబాబు, బావజాన, సునీల్, సాంబ, రఫీ తదితరులు పాల్గొన్నారు.