Share News

Tourism Development : రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ పునరుద్ధరణ

ABN , Publish Date - Mar 23 , 2025 | 05:38 AM

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు బ్లూఫ్లాగ్‌ ఇండియా నేషనల్‌ ఆపరేటర్‌ డాక్టర్‌ శ్రీజిత్‌ కురూప్‌ వెల్లడించారు.

Tourism Development : రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ పునరుద్ధరణ

జిల్లా కలెక్టర్‌కు జెండా అందజేసిన బృంద సభ్యులు

విశాఖపట్నం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు బ్లూఫ్లాగ్‌ ఇండియా నేషనల్‌ ఆపరేటర్‌ డాక్టర్‌ శ్రీజిత్‌ కురూప్‌ వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్‌ జ్యూరీ సభ్యుడు అజయ్‌ సక్సేనాతో కలిసి శుక్రవారం బీచ్‌ను సందర్శించి, సదుపాయాలను పరిశీలించిన సంగతి తెలిసిందే. అన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గత నెల ఉపసంహరించుకున్న గుర్తింపును పునరుద్ధరిస్తూ దానికి సంబంధించిన జెండాను జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు శనివారం అందజేశారు. భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్‌ నిర్వహణ వంటివి ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని సూచించినట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి సుగుణ సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Mar 23 , 2025 | 05:41 AM