Home » Rushikonda
విశాఖ నగరాన్ని సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు రుషికొండ బీచ్‌లో పారాగ్లైడింగ్ అందుబాటులోకి రానుంది.
విశాఖలోని రుషికొండపై కట్టిన విలాసమైన ప్యాలె్‌సకు పెట్టిన ఖర్చుతో 26 వేలమంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చునని మంత్రులు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి కోసం రుషికొండలో ఏర్పాటుచేసిన విలాసాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుందని వ్యాఖ్యానించారు.
రుషికొండ రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు.
రుషి కొండ ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏం చేశారో వివరించే ఫైల్ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైల్ ఏపీటీడీసీ వద్ద ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది.
విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.
రుషికొండ లాంటి నిర్మాణాన్ని ఎక్కడైనా నిర్మించారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడైనా చూపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. రుషికొండ అద్భుతమైన నిర్మాణమని గతంలో చెప్పలేదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
విశాఖలో రుషికొండ ప్యాలె్‌సను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో నిబంధనలను ఇంతగా ఉల్లంఘించగలరా అని ఆశ్చర్యం, ఉద్వేగం కలుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
‘రుషికొండలో ప్యాలెస్‌లు కట్టడానికి 500 కోట్లు ఖర్చుచేశారు.
తాను 30 ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్న నాటి ముఖ్యమంత్రి జగన్.. తన కుటుంబం కోసం విశాఖ రుషికొండపై రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతమైన ప్యాలె్‌సను నిర్మించుకున్నారు.
విశాఖకు చెందిన ‘లైవ్ ఇన్ అడ్వంచర్స్’ సభ్యులు గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సముద్రంలో 78 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు.