రిజర్వ్ ఫారె్‌స్టలో ‘సజ్జల’ సామ్రాజ్యం!
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:03 AM
జగన్ హయాంలో సకల శాఖా మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు.
రిజర్వ్ ఫారె్‌స్టలో కడప శివారున 42 ఎకరాల అటవీ భూమి కబ్జా విలువ కోట్లలో
దర్జాగా మామిడి, నేరేడు, టేకు సాగు
అక్కడే గెస్ట్‌హౌ్‌సలు, షెడ్ల నిర్మాణం
కాల్వలు, కుంటలూ వదలని వైనం
రామకృష్ణారెడ్డి అండతో సోదరుల ఆక్రమణ
కొట్టేసినవారు సజ్జల బినామీలని ప్రచారం
(కడప-ఆంధ్రజ్యోతి)
జగన్ హయాంలో సకల శాఖా మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. ఎకరా, రెండు ఎకరాలు కాదు ఏకంగా 42 ఎకరాల భూమి ఆక్రమించేశారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతేగాక అటవీ భూమిలో గెస్ట్‌హౌ్‌సలు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారని తెలుస్తోంది. వారంతా ఆయన బినామీలనే ప్రచారం ఉంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన ఈ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాసి. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తరువాత అన్నీ ఆయనే చూసుకునేవారు. అప్పట్లో సీఎంతో పాటు సీఎస్, డీజీపీ కూడా కడప వాళ్లే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకం గా అటవీ భూమినే కబ్జా చేశారు. కాల్వలు, కుంటలు కూడా ఆక్రమించారు.
200 ఎకరాలతో సజ్జల ఎస్టేట్
సజ్జల రామకృష్ణారెడ్డి, దివాకర్‌రెడ్డి, జనార్దనరెడ్డి.. ముగ్గురూ అన్నదమ్ములు. వీరిలో దివాకర్‌రెడ్డి చనిపోయారు. కుటుంబంలో మొత్తం పెత్తనమంతా సజ్జల రామకృష్ణారెడ్డిదని చెబుతారు. కడప నగర శివారులోని సీకేదిన్నె రెవెన్యూ పొలంలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిని ఆనుకుని సజ్జల సోదరులకు భూములున్నాయి. కడప నుంచి రాయచోటి మార్గంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వరకు విలువైన భూములున్నాయి. ఇక్కడ కడప వైసీపీ నేతలకు ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయి. అప్పుడప్పుడూ ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని చెబుతారు. సీకేదిన్నె రెవెన్యూ పొలంలోని సర్వే నెంబరు 1599, 1600/1, 2, 1601/1, 1ఎ, 2, ఇంకా ఇతర సర్వే నెంబర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్‌రెడ్డి తనయుడు సందీ్‌పరెడ్డికి దాదాపు 130 ఎకరాలకు పైగా ఉన్నాయి. సీకేదిన్నె రెవెన్యూ పొలం సర్వే నెంబరు 1629లో 11,129.33 ఎకరాల అటవీ భూమి ఉంది. సజ్జల సోదరులు ఈ భూముల్లో కొంత ఆక్రమించేశారు. ఇక్కడ సజ్జల ఎస్టేట్‌కు సంబంధించి మొత్తం 206.13 ఎకరాల భూమి ఉంది. ఇందులో పట్టా భూమి 146.75 ఎకరాలు, ప్రభుత్వ భూమి 10.2 ఎకరాలు, డీకేటీ 5.14 ఎకరాలు, చుక్కల భూమి 2.02 ఎకరాలు ఉన్నాయి. అటవీ భూమి 42.20 ఎకరాలను ఆక్రమించేశారు. ఇందులో మామిడి, నేరేడు, టేకు ఇతర పంటలు సాగు చేశారు. అక్కడే గెస్ట్‌హౌ్‌సలు కట్టారు. అక్కడ పనిచేసే ఉద్యోగులకు షెడ్లు ఏర్పాటు చేశారు.
కుటుంబ సభ్యులే బినామీలు!
ఆ ప్రాంతానికి బయటి వ్యక్తులను అనుమతించరు. సజ్జల అండతోనే కోట్ల విలువ చేసే భూములు కొట్టేశారని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా తన పేరు లేకుండా తన కుటుంబ సభ్యుల ద్వారా ఆక్రమించినట్లు చెబుతారు. వారు సజ్జల బినామీలనే ప్రచారం ఉంది. ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు రిజర్వు ఫారెస్టులో ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికీ అక్కడ నెమళ్లు తిరుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూములు కొట్టేసినా అటు అటవీశాఖ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకున్నాయి. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం ఇటీవల కలెక్టర్ దృష్టికి రావడంతో సర్వే చేయిస్తున్నారు.