Share News

రెడీ.. వన్‌ టూ త్రీ .. నెగ్గేదెవరో?

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:40 AM

గతంలో పండుగ నెల పడితే చాలు ఇక ఊరువాడా సందడే సందడి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడికక్కడ కోడిపందేలు వేసుకునేవా రు. పందేలు తగవంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నట్లే కన్పించేవా రు. పోలీసులదీ ఇదే పాత్ర. ఊరు వాడా పం దేలు వేస్తే సహించమంటూ మైకులతో హోరె త్తించడం రీవాజు.

 రెడీ.. వన్‌ టూ త్రీ .. నెగ్గేదెవరో?
ఏలూరు రూరల్‌ మండలం కోడేలులో కోడి పందేలకు సిద్ధం చేస్తున్న బరి

ఊరూవాడా బరులు సిద్ధం

పందేలకు ముహూర్తం ఖరారు

పేకాట, గుండాటకు లక్షల్లో వేలం

చూసీ చూడకుండా ఉంటే బంపర్‌ ఆఫర్లు.. నిర్వాహకుల ఎత్తుగడలు

శాఖల వారీగా శాంతింపజేసే ప్రయత్నాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

సంక్రాంతి వచ్చిందంటే చాలు. అందరి లోనూ ఒక్కటే టెన్షన్‌. చిన్నాపెద్దా తేడా అసలే ఉండదు. బరులు ఎక్కడ నిర్వహిస్తున్నారు, పందేలు ఎక్కడ ఉండబోతున్నాయి, పోలీసులు ఊరు కుంటారా.. కాదంటే నాయకులు ఆగు తారా. ఈ ఏడాది ఏం జరగబోతోంది. అనుకున్నదే అవుతుందా.. పండుగ మూడు రోజులు కోళ్లు కాళ్లు దువ్వు తాయా..? లేదా..? అంతటా ఇదే టెన్షన్‌. అందరి నోటా సమాధానాలు లేని ప్రశ్నలే.

గతంలో పండుగ నెల పడితే చాలు ఇక ఊరువాడా సందడే సందడి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడికక్కడ కోడిపందేలు వేసుకునేవా రు. పందేలు తగవంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నట్లే కన్పించేవా రు. పోలీసులదీ ఇదే పాత్ర. ఊరు వాడా పం దేలు వేస్తే సహించమంటూ మైకులతో హోరె త్తించడం రీవాజు. పెద్దఎత్తున కోడికి కట్టే కత్తు లు స్వాధీనం చేసుకోవడం, బైండోవర్‌ కేసులు పెట్టడం, పందేలపై దాడులు నిర్వహించడం, పందెం పుంజులతో సహా అరెస్ట్‌ చేయడం సం క్రాంతి పండుగ నాడు ఊరురా జరిగేదే. సంక్రా ంతి పండుగ అంటేనే సంప్రదాయ వ్యవహారం తెరమరుగునపడి కోడిపందేలు, గుండాట, పేకా ట వంటివన్నీ తెరముందుకు వచ్చాయి. సంక్రాం తి సీజనులో న్యాయస్థానం ఆదేశాల మేరకు కోడిపందేలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించడం ప్రతిసారి వస్తూనే ఉంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున పందెం బరులను పోలీసులు ధ్వంసం చేశారు. రెండు వేలకు పైగా కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర వేలమందికి పైగా బైండోవర్‌ కేసులు పెట్టారు. గీత దాటితే ఖబడ్దార్‌ అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు.

అయినా ఆగేనా ?

పోలీసులు ఇంత చేస్తే ఎక్కడా సంక్రాంతి జోష్‌ తగ్గేదట్టు లేదు. ఇప్పటికే పండుగ మూడు రోజులు అనుమతులు లభించకపోయినా అన్ని నియోజకవర్గాల్లోనూ పందెలకు బరులను సిద్ధం చేస్తున్నారు. పోలీసు శాఖలో వున్న సిబ్బంది, అధికారుల సంఖ్య అత్యల్పం కాబట్టి పెద్దసంఖ్య లో వెలుస్తున్న పందెం బరులపై దాడులు చేయ డం దాదాపు సవాలుగానే మారింది. సంప్రదా య పోటీల పేరిట కొందరు పందేలకు సిద్ధం చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు తెలుగు దేశం, జనసేన అనుకూలురే ఈసారి ఎక్కువగా బరుల నిర్వాహణకు దిగుతున్నారు. నిన్న మొన్న టి వరకూ ఎన్నికల్లో తెగ ఖర్చు అయింది కాబ ట్టి కాస్తో కూస్తో ఈ మూడు రోజుల సీజన్‌లోనే కూడబెట్టుకోవాలనే తపన స్థానిక నేతలత్లో కన్పిస్తోంది. ప్రత్యేకించి ఒక పందెం బరిని సిద్ధం చేస్తే ఆ బరి నిర్వాహణకు గాను వేలల్లో ఖర్చు అవుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం వున్నా లేకపోయినవారిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత నిర్వాహకులదే. ఆయా ప్రాంత పోలీస్‌స్టేషన్లకు, స్థానికనేతలకు, తమ వద్దకు వచ్చిన వారిని కాదనకుండా సంక్రాంతి ఆఫర్‌ అందేలా చూస్తారు. ఆఖరికి పోలీసులతో పాటు అనేకమందికి ఈ మూడు రోజులు కోజా (చనిపోయిన పందెం పుంజు) ఇచ్చేందుకు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి భోగి రోజు సోమవారం తొమ్మిది గంటల నుంచే కోళ్లు బరిలోకి దిగేందుకు వీలుగా సిగ్నల్‌ రాబోతున్నట్టు ఇప్పటికే ఊరువాడ ప్రచారం సాగుతోంది. దెందులూరు, నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాలు అన్నింట్లో బరులు పెద్దఎత్తున వెలుస్తున్నాయి.

పందేలకు ముందే వేలం పాట

ప్రతి బరిలోనూ బరి నిర్వహించే వారంతా ముందస్తుగా లోనా బయట, పేకాటకు గుండాట వంటి వాటిని నిర్వహించుకునేం దుకు ఇప్పటి కే ఎక్కడికక్కడ నిర్వాహకులు రహస్యంగా వేలం నిర్వహించారు. ప్రత్యేకించి కోసాటకు ప్రతి బరిలోనూ లక్షల్లో వేలం పాడా రు. గతంలో గతేడాది పెద్ద బరి అయితే రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు, మరీ చిన్న బరు లు అయితే రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షలు నిర్వాహకులకు కప్పం చెల్లిం చాల్సిందే. ఎందు కంటే సంక్రాంతి మూడు రోజులు జూదానికి అడ్డే ఉండదు. పేకాట అంటే చెవి కోసుకునే వారు ఈ మూడు రోజులు కోసాట వద్దే తడ్చాడ తారు. జిల్లా మొత్తం మీద సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకూ పేకాటలోనే చేతులు మారతాయి. ఇది కాకుండా చెరువుగట్టు మీద, తోటల్లోనూ అతిథి గృహాలు, హోటళ్లు, లాడ్జిలు, అపార్ట్‌మెంట్లలో ఎడాపెడా పేకాట జోరుగా సాగబోతోంది. సాధ్యమైనంత మేర నగదు ప్రదర్శించకుండా కాయిన్‌ రూపంలో చెల్లింపులు జరిపేలా కొంతమంది జాగ్రత్త పడు తున్నారు. ఇక గుండాట విషయానికి వస్తే కుర్ర కారంతా ఇక్కడే వాలిపోతారు. ఈ ఆట నిషేధించినా ఎవరూ ఖాతరు చేయడం లేదు.

సిద్ధం కండి.. మిత్రమా !

‘ఏటా మాదిరిగానే ఈ ఏడాది కోడి పందేలు ఉంటున్నాయి. ఎవ్వరూ భయ పడవద్దు. భోగి నుంచి కనుమ వరకు అంతా రెడీ’ అంటూ ఇప్పటికే అనేక మంది తమ ప్రాంతంలో వున్న మిత్రు లకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌ నుంచి తరలి వచ్చిన అతిథులే పందేల్లో పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, వారి అనుచరు లు కొన్నిచోట్ల సంప్రదాయబద్ధంగా ఆటల పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి పండుగ పూట ఎవరూ అసంతృప్తి చెంద కుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇన్నాళ్లు తమ చుట్టూ తిరిగిన ముఖ్య నేతలంతా నేరుగా పందెలు వేసుకోవడానికి పరోక్ష సందేశాలు ఇచ్చినట్లు కన్పిస్తోంది. కొందరైతే పందాల నిర్వాహణకు వీలుగా ప్రత్యేకంగా పాస్‌లు ఇచ్చేందుకు ప్లాన్‌ చేశారు. మరోవైపు పోలీసులు కూడా అప్రమత్తమయ్యా రు. ఇంతకు ముందు జంగారెడ్డిగూడెం రూరల్‌ మండలంలో తెలంగాణ ప్రాంతానికి చెందినవా రు కాల్పులకు దిగారు. ఇది పొరపాటుగా జరిగి నట్లుగానే అప్పట్లో భావించినా ప్రజలు హడలెత్తి పోయారు. ఈ తరహా ఘటనలతో పాటు తాగి ఊగి రెచ్చిపోయి ఒకరినొకరు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వారిని ఉపేక్షించేది లేదని పోలీ సులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడా నిఘా బృందాలు ఓ కన్నేసి ఉంచాయి.

Updated Date - Jan 13 , 2025 | 12:40 AM