అడ్డంకుల నడుమ ఆరు లేన్లు
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:37 PM
పట్ట ణాల నుంచి రాజధాని నగరాలకు వెళ్లాలన్నా, మెగా నగరాలకు వెళ్లాలన్నా ప్రయాణీకుల దూ రాన్ని తగ్గిస్తూ ప్రయాణీకుల మెరుగైన సౌకర్యం కల్నించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఇందులో భాగంగా విజయవాడ మీదుగా కడప, బెంగ ళూరుకు వెళ్లే గ్రీన్‌ఫీల్ ్డ నిర్మాణం ఆరు లేన్ల రహ దారికి పనులు 20 కిలో మీటర్ల మేర పనులు జరిగితే నాలుగున్నర కిలో మీటర్ల మేరకు అభ్యంతరాలు వ్యక్తం మవుతున్నాయి. ఆరులేన్ల రహదారికి నిధులు కేటాయించింది. వివరాల్లోకెళితే...
20 కి.మీ రోడ్డు పనులకు నాలుగున్నర కి.మీ అభ్యంతరాలు
క్లియరెన్స్ అయ్యేనా...?
పనులు పూర్తయ్యేదెప్పుడు
పోరుమామిళ్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పట్ట ణాల నుంచి రాజధాని నగరాలకు వెళ్లాలన్నా, మెగా నగరాలకు వెళ్లాలన్నా ప్రయాణీకుల దూ రాన్ని తగ్గిస్తూ ప్రయాణీకుల మెరుగైన సౌకర్యం కల్నించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఇందులో భాగంగా విజయవాడ మీదుగా కడప, బెంగ ళూరుకు వెళ్లే గ్రీన్‌ఫీల్ ్డ నిర్మాణం ఆరు లేన్ల రహ దారికి పనులు 20 కిలో మీటర్ల మేర పనులు జరిగితే నాలుగున్నర కిలో మీటర్ల మేరకు అభ్యంతరాలు వ్యక్తం మవుతున్నాయి. ఆరులేన్ల రహదారికి నిధులు కేటాయించింది. వివరాల్లోకెళితే...
విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి. బెం గళూరు నుంచి విజయవాడ వెళ్లేవారికి తక్కువ దూరం పట్టేందుకు వీలుగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. మల్లేపల్లె నుంచి కవలకుంట్ల రెవెన్యూ పొలాల వరకు దాదాపు 20 కి.మీ పొడవునా ఆరు లేన్ల రహదారికి రూ.622 కోట్లు నిధులు కేటాయించింది. మల్లేపల్లె నుంచి చెన్నారెడ్డిపేట వరకు అర్త్ పనులు ప్రారంభమయ్యాయి. 20 బ్రిడ్జిలు అండర్‌ప్రాసెస్‌లో ఉన్నాయి. సిద్దవరం వద్ద దాదాపు 5 కి.మీ అర్త్ వర్క్ జరుగుతోంది.
ఆరు లేన్ల రహదారికి నీళ్లు తడుపుతున్న దృశ్యం
అటవీశాఖకు సంబంధించి ఇంకా కిలోమీటరు క్లియరెన్స్ కావాల్సి ఉండగా ఈ పనులు దక్కిం చుకున్న మెగా ఇంజనీరింగ్ కన్స్‌స్ట్రక్షన్స్ వారు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక కోరింది. మూడున్నర కిలోమీటరు రైతులకు సంబంధించి నష్టపరిహారం కొందరికి అందకపోవడం వల్ల ఆ పనులు కూడా కొద్దిగా జాప్యం జరిగే అవకాశా లున్నాయి. ప్రస్తుతం 15శాతం పనులు జరిగా యి. కొన్నిచోట్ల టన్నెల్ పనులు జరుగుతున్నాయి. దాదాపు ఆరులేన్ల రహదారికి సంబంధించి 8గ్రా మాలకు 162 ఎకరాల పొలాలు రహదారికి అవ సరం అవుతాయి. వీటి కోసం రహదారి నిర్మాణం లో భూములు కోల్పోయే వారి కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు నిదులు మంజూరు చేసింది. ఇందులో దాదాపు 247 మంది రైతులకు రూ.13 కోట్ల వరకు పంపిణీ జరిగినట్లు సమాచారం. ఇంకా 68 ఎకరాలకు సంబంధించి 56 మంది రైతులకు పరిహారం అందాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని చెబుతున్నారు.
రోలరుతో చదును చేస్తున్న దృశ్యం
ఇటీవల జేసీ కూడా భూములు పరిశీలించి పనులకు అభ్యంతరాలు తెలపవద్దని, అర్హులందరికీ నష్టప రిహారం దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇం దుకు సంబంధించి గతంలో రెవెన్యూ అధికారు లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి భూము లు కోల్పోయే వారి విస్తీర్ణం, రికార్డులను అప్పజె బితే వారందరికీ పరిహారం అందిస్తామని చెబు తున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఆరులేన్ల రహదా రికి అడ్డంకులన్నీ పూర్తి చేసుకుని నిర్మాణం వేగవంతమైతే పూర్తయ్యే సమయానికి ఎంత సమయం పడుతుందోనని ఈ ప్రాంతీయులు ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల గ్రావెల్‌కు మైనింగ్ అధికారుల అనుమతులు కూడా అందాల్సి ఉందని తెలిసింది. ఈ అడ్డంకులన్నీ తొలగి పనులు ఎప్పుడు వేగవంతమవుతాయో, ఎప్పుడు పూర్తవుతాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులు అయితే నష్టపరి హారం కోసం ఎదురు చూస్తున్నారు.