Share News

TTD Snake Scare: టీటీడీ ఈవో బంగ్లాలోకి పాము

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:45 AM

తిరుపతిలో టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము చొచ్చుకొచ్చింది. పట్టుకునే క్రమంలో పాము కాటు వేసి, విశ్రాంత ఉద్యోగి రవీందర్‌ నాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

TTD Snake Scare: టీటీడీ ఈవో బంగ్లాలోకి పాము

  • పట్టేందుకు వెళ్లిన విశ్రాంత ఉద్యోగికి కాటు

తిరుపతి(వైద్యం), ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలోకి గురువారం అర్ధరాత్రి నాగుపాము వచ్చింది. దీనిని పట్టుకునేందుకు టీటీడీ విశ్రాంత ఉద్యోగి రవీందర్‌ నాయుడు వెళ్లారు. నాగుపామును పట్టుకొని సంచిలో వేసే క్రమంలో ఆయన చేతిపై కాటు వేసింది. వెంటనే రవీందర్‌నాయుడును స్విమ్స్‌ అత్యసర విభాగానికి తీసుకెళ్లారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. దీంతో రవీంద్రనాయుడును శుక్రవారం సాధారణ వార్డుకు మార్చారు.

Updated Date - Apr 19 , 2025 | 05:45 AM