Share News

23 కేసుల్లో చోరీ సొత్తు బాధితులకు అప్పగింత

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:41 AM

ఇంట్లో దొంగతనం జరిగిందంటే కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లోను ఎంతో విషాదం నింపుతుంది. అయ్యో పాపం అంటూ ఓదార్చుతారే తప్ప ఆ నగలను తిరిగి తీసుకువచ్చి అప్పగించగలిగేది పోలీసులు మాత్రమే. జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ గత ఏడాది జూన్‌ 15న ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు దొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన వస్తువులను తిరిగి బాధితులకు అప్పగించారు.

23 కేసుల్లో చోరీ సొత్తు బాధితులకు అప్పగింత
బాధితులకు వస్తువులను అందిస్తున్న ఎస్పీ

ఏలూరు క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఇంట్లో దొంగతనం జరిగిందంటే కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లోను ఎంతో విషాదం నింపుతుంది. అయ్యో పాపం అంటూ ఓదార్చుతారే తప్ప ఆ నగలను తిరిగి తీసుకువచ్చి అప్పగించగలిగేది పోలీసులు మాత్రమే. జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ గత ఏడాది జూన్‌ 15న ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు దొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన వస్తువులను తిరిగి బాధితులకు అప్పగించారు. మరో 23 కేసుల్లో దొంగతనాల కేసుల్లో దొంగలను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఫిర్యాదుదారులు తమ చోరీ సొత్తు పొందా లంటే కోర్టులో న్యాయవాది ద్వారా పిటీషన్‌ దాఖలు చేసుకుని ఆ సొత్తుకు సరిపడా షూరిటీ తీసుకుని అనుమతి ఇచ్చేలా కోర్టు ఉత్తర్వులు ఇస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాని ఎస్పీ బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆయన ప్రతి దొంగతనం కేసులో చర్యలు చేపట్టారు. ఇప్పటికూ మోటారు సైకిళ్ల దొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన మోటారు సైకిళ్లు అన్నింటిని వాహన యజమాని వ్యక్తిగత పూచీకత్తుతో ఆ వాహనాలను స్టేషన్‌ నుంచే నేరుగా అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో 23 కేసుల్లోనే రికవరీ చేసిన చోరీ సొత్తు రెండు కేజీల రెండు వందల ఆరు గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాముల బంగారపు వస్తువులు, తొమ్మిది కేజీల నాలుగు వందల వెండి వస్తువులు, మరో లక్ష నగదును కోర్టు అనుమతులను పోలీసుశాఖయే తీసుకుని ఆదివారం ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ బాధితులకు అప్పగిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నాడు వారంతా సంతోషంగా ఉండాలని ఆశించి వారి వస్తువులు వారికి అందించామన్నారు. కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితో వైఫై సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని దీనివల్ల ఆ ఇంటి ఒక వ్యక్తి కాపలా ఉన్నట్లేనని సూచించారు. నగలను పొందిన బాధితులంతా ఆనందభాష్పాలతో ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పెదపాడుకు చెందిన 72 ఏళ్ల మహిళ గుండా సరోజని తన బంగారపు గొలుసును చూసి తన్మయత్వంతో కంటతడి పెట్టుకుని ఎస్పీని హత్తుకుని తన వస్తువును తనకు అప్పగించారని కన్నీటి బాష్పాలతో ఆనందం తెలిపింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, భీమడోలు సీఐ యుజె విల్సన్‌, పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు, త్రీ టౌన్‌ సీఐ కోటేశ్వరరావు, డీసీఆర్బీఎస్‌ఐ రాజారెడ్డి పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:41 AM