5 కేజీల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:14 AM
ఒడిశా నుంచి గంజాయిని కొను గోలు చేసి తీసుకువస్తూ మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంత ర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద దువ్వు సాయిరెడ్డి అలి యాస్ సాయి పట్టుబడి నట్లు సీఐ వి.రామారావు తెలిపారు.
పాతపట్నం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి గంజాయిని కొను గోలు చేసి తీసుకువస్తూ మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంత ర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద దువ్వు సాయిరెడ్డి అలి యాస్ సాయి పట్టుబడి నట్లు సీఐ వి.రామారావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి పర్లాకిమిడిలో రూ.12 వేలకు 5.662 కేజీల గంజాయిని కొనుగోలు చేసి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు చెందిన ఒక వ్యక్తికి విక్రయిం చేందుకు గాను తీసుకువస్తూ మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టుబడ్డాడన్నారు. అరస వల్లి మిల్లుకూడలి రెడ్డిక వీధికి చెందిన దువ్వు సాయిసురేష్ రెడ్డి ఐటీఐ చదువుకొని కుటుంబ పోషణ నిమిత్తం చదువు మానేసి గార మండలం పొగాకువానిపేట గ్రామంలో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్ప డింది. అప్పటికే గంజాయి వ్యాపారంలో ఉన్న సదరు వ్యక్తి కమీషన్ ఆశ చూపి గంజాయి తరలింపులో సహకరించాలని కోరగా సాయి అంగీకరించాడు. గతంలోనూ రెండు పర్యాయాలు గంజాయి నెల్లూరుకు తరలించగా రూ.3 వేలు చొప్పున కమీషన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సారి ఎక్కువ మొత్తం లో తీసుకురావాలని కోరగా సాయి ఉదయగిరి ఏరియాకు చెందిన వ్యక్తిని సంప్రదించి మంగళవారం మధ్యాహ్నం పర్లాకిమిడి బస్టాండ్ వద్ద సదరు వ్యక్తికి రూ.12 వేలు చెల్లించి మూడు మూటలుగా ఉన్న గంజాయి ప్యాకె ట్లను తీసుకుని పాతపట్నంలో బస్సు ఎక్కేందుకు నడుచు కుంటూ వస్తుం డగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 5.662 కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత నిర్వీర్యమవు తున్నా రన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచి ంచారు. నిందితుడిని పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ బి.లావణ్య, ఏఎస్‌ఐ ఎల్.అప్పారావు, కానిస్టేబుళ్లను ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ తెలిపారు.