ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలను ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం వేళ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. ఈ సంఘటన వైసీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు.
Zilla Parishad general meeting చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గతానికి భిన్నంగా ఈసారి అధికార పార్టీ నేతలు సభ్యులకు దీటుగా బదులిచ్చారు.
Dried fish imported ఆంధ్రా-ఒడిశాలో ఎక్కువగా వినియోగించే ఎండుచేపలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ఎన్నో పోషక విలువలు వీటి సొంతం కావడంతో.. ఔషధ తయారీకి వీటిని వినియోగిస్తున్నారు.
‘Abhyudayam Cycle Tour’ అందరి సహకారంతోనే డ్రగ్స్, గంజాయి నిర్మూలన సాధ్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి ఆలయం నుంచి కొత్తపేట జంక్షన్ వరకు ‘అభ్యుదయం సైకిల్‌యాత్ర’ నిర్వహించారు.
The school surroundings are cleaning ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు శుభ్రమైన దుస్తులు ధరించి... పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో శనివారం ఆరు కిలోల గంజాయితో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి పార్టీ అధి నేత చంద్రబాబు నాయుడు సీఎం అయితే తిరుపతి వచ్చి మొక్కు చెల్లించుకుంటానని భావించిన కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెయ్యిల ప్రసాద్ ట్రై సైకిల్ యాత్ర కు శ్రీకారం చుట్టాడు.
మునసబుపేట గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొక రికి తీవ్రంగా గాయపడ్డాడు.
శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామంలో ‘సంప్రదాయం’ గురుకులంలో శనివారం రాత్రి నిర్వహించిన అర్ధనారీశ్వరం (శృంగారం నుంచి మోక్షం) కూచిపూడి నృత్య రూపకం ఆకట్టుకుంది.
జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ సక్రమంగా పోలి యో చుక్కలు వేయించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.