Share News

ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు: ఎమ్మెల్యే రవికుమార్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:56 PM

నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు: ఎమ్మెల్యే రవికుమార్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌:

ఆమదాలవలస, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన మండల సమావేశం జరిగింది. తొలుత పలు శాఖలపై సమీక్షిం చారు.గ్రామాల్లో చేపడుతున్న శాఖల విధి నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి పథకం నిధులతో చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీల పనులపై సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం చూపుతున్నారని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. అలాగే అలాగేఆమదాలవలసలోని టీడీపీకార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్‌ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.ఈసందర్భంగానాలుగు మండలా లు,మునిసిపాలిటీకి చెందిన ప్రజలు పలు సమస్యలపై అర్జీలు అందజేశారు.ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ గోవిందరావు, సర్పంచ్‌ నూకరాజు, ఎంపీటీసీ అన్నెపు భాస్కరరావు, సీఐ పి.సత్యనారా యణ, నాయకులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, సత్యనారాయణ, మొదలవలస రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:56 PM