ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:09 AM
మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో చేపట్టిన ఉపా ధి హామీ పనులను ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం శనివారం పరిశీలించింది.
మెళియాపుట్టి/పాతపట్నం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో చేపట్టిన ఉపా ధి హామీ పనులను ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం శనివారం పరిశీలించింది. బృంద సభ్యులు కిరణ్‌పాడి, భరత్‌సింగ్ రోడ్లు, ఉపాధి పనులను పరిశీ లించారు. మెళియాపుట్టి మండలం ఎంసీపీ కొత్తూరు, అడ్డివాడ గ్రామాల్లో రోడ్లను పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. ఉపాధి నిధులతో కొండపై గ్రామానికి వేసిన రోడ్డు వల్ల డోలీ బాధలు తప్పాయని అడ్డివాడ గ్రామస్థులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సంద ర్భంగా బృంద ప్రతినిధులు మాట్లా డుతూ.. మీకు ఏమి అవసరమో తెలిపితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ఆదాయం వచ్చే మొక్కలు ఇవ్వాలని, తాగునీటి సమస్యలను పరి ష్కరించాలని స్థానికులు పేర్కొనగా ఉపాధి నిధులు నుంచి బావులు తవ్వేందుకుఅనుమతులివ్వడం జరుగు తుందన్నారు. పాతపట్నం మండలం బడ్డుమర్రి, ఏఎస్ కవిటి పంచాయతీల్లో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని సూచిం చారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పనులపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర పరిశీలన చేయాలని ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో ఏపీడీలు రాధ, శైలజ, ఐటీడీఏ ఈఈ రమాదేవి, డీఈ సిమ్మన్న, ఎంపీడీవోలు ప్రసాద్‌పండా, పి.చంద్రకుమారి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.