Share News

Cm chandrababu: సీఎం పర్యటన ఖరారు

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:14 AM

Chief Minister Visit ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 26న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేసి మత్స్యకార భరోసా కింద లబ్ధిదారులకు రూ.20వేలు చొప్పున అందజేయనున్నారు.

Cm chandrababu: సీఎం పర్యటన ఖరారు
బుడగట్లపాలెం వద్ద స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఆర్డీవో కె.సాయిప్రత్యూష

  • 26న జిల్లాకు చంద్రబాబు రాక

  • మత్స్యకార భరోసా పంపిణీకి ఏర్పాట్లు

  • ఎచ్చెర్ల నియోజకవర్గంలో సభకు స్థల పరిశీలన

  • శ్రీకాకుళం/ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 26న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేసి మత్స్యకార భరోసా కింద లబ్ధిదారులకు రూ.20వేలు చొప్పున అందజేయనున్నారు. మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెం, జీరుపాలెం, కొవ్వాడ తదితర సముద్ర తీర గ్రామాలను ఆదివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఆర్డీవో కె.సాయిప్రత్యూష పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.గోపాల్‌, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, మండల టీడీపీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, స్థానిక సర్పంచ్‌ అల్లుపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:14 AM