Share News

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:23 PM

జాతీయ రహదారి బీర్లు పరిశ్రమ సమీపంలో ఈ నెల 25వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

రణస్థలం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి బీర్లు పరిశ్రమ సమీపంలో ఈ నెల 25వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆది వారం ఎస్‌ఐ తెలిపారు. ఆ రోజు రాత్రి రోడ్డు దాటుతు న్న గుర్తుతెలియని వ్యక్తిని ఓ ద్విచక్రవాహనదారుడు ఢీ కొన్నాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మతిస్తిమితం లేక గత కొన్ని రోజులుగా ఆ వ్యక్తి ఈ ప్రాంతంలో తిరుగుతున్న ట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. మృతదేహం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో ఉంచామని, వివరాలు తెలిసినవారు సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
గ్రానైట్‌ నీటి కుండీలో పడి వ్యక్తి..
కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 27(ఆంద్రజ్యోతి):
పెద్ద బమ్మిడి గ్రామ సమీపం లో ఓ ప్రైవేటు గ్రానైట్‌ కంపెనీలో పనిచేస్తున్న అసోం రాష్ట్రం బొగైయ్‌గోల్‌ జిల్లా గురునానక్‌ నగర్‌కు చెం దిన కాళీరాయ్‌ (34) నీటి కుండీలో పడి మృతిచెందాడు. మృతుడు ఈ పరిసరాల్లో అనేక కంపెనీల్లో పనిచేసి మానేసి గ్రానై ట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని కార్మికులు తెలు పుతున్నారు. రెండు రోజులుగా పనికి రాలే దని, స్వగ్రామానికి వెళ్లి ఉంటాడని భావించా మని కంపెనీ యాజమాన్యం, కూలీలు తెలి పారు. నిత్యం మద్యం సేవించే అలవాటు ఉన్న రాయ్‌ ఆదివారం తెల్ల వారుజామున కంపెనీకి చెందిన 10 అడుగుల లోతు ఉన్న నీటి కుండీలో శవమై తెలి ఉండడాన్ని గమనించిన తోటి కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్య నారాయణ తెలిపారు. ఎలా మృతి చెందాడన్నది తెలియరాలేదు.

Updated Date - Apr 27 , 2025 | 11:23 PM