ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:05 AM
ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యా యులు అవగాహన కల్పించారు.సోమవారం జిల్లాలోని పలు గ్రామాల్లో తల్లిదం డ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వపాఠశాలల్లో ఉన్న వసతులు, సౌకర్యాలను వివరించారు.
ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యా యులు అవగాహన కల్పించారు.సోమవారం జిల్లాలోని పలు గ్రామాల్లో తల్లిదం డ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వపాఠశాలల్లో ఉన్న వసతులు, సౌకర్యాలను వివరించారు.
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): మన ఊరు-మన బడిని కాపాడుకోవాలని డొంకూరు జడ్పీపాఠశాల హెచ్‌ఎం సరోజిని కోరారు.డొంకూరు, చిన్న,పెద్ద లక్ష్మీపురం, శివకృష్ణాపురం, సన్యాసిపుట్టుగ, కేశుపురంల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వపాఠశాలల ఆవశ్యకతను వివరించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి రాం, కమలాకర్, శంకర్‌రెడ్డి, వెంకటేస్, నూకయ్య, వల్లభవరావు పాల్గొన్నారు.
ఫసరుబుజ్జిలి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంఈవో కంచరాపు శ్రీనివా సరావు తెలిపారు. మండలంలోని చిగురువలసలో అడ్మిషన్ డ్రైవ్‌లో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో సీఆర్పీ బెండి చిన్నారావు పాల్గొన్నారు. అలాగే మునిసిపాలిటీలోని 19వ వార్డు పరిధిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ నాగళ్ల మురళీధర్‌యాదవ్ వాంబేకాలనీ, హడ్కోకాలనీలో ఇంటింటికి వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఆయన వెంట హెచ్‌ఎం గోవిందరాజులు, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ గొల్లపల్లి సింహాద్రి, టీడీపీ నాయకులు గొండు కరుణాకరరావు, రీసు చిరంజీవి ఉన్నారు.
ఫకంచిలి, ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): కత్తివరం ప్రాఽథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం మాధవి బెహరా, ఎంఈవో-2 చిట్టిబాబు ఆధ్వర్యంలో విద్యార్థుల నమోదు కార్యక్ర మాన్ని నిర్వహించారు.గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రు లకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా 15మంది ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు.