Share News

పనితీరు మారకుంటే ఉపేక్షించేది లేదు

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:36 AM

వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పనితీరు మారకపోతే ఉపేక్షించేది లేదని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ హెచ్చరించారు.

పనితీరు మారకుంటే ఉపేక్షించేది లేదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

సరుబుజ్జిలి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పనితీరు మారకపోతే ఉపేక్షించేది లేదని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ హెచ్చరించారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కిల్లి రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమీక్ష నిర్వహించిన పలు శాఖల అధికారుల తీరుపై ఎమ్మెల్యే రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు అమలులో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని, ఇకపై అలా జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చ రించారు. తొలుత ఎంపీడీవో బీవీ ప్రసాదరావు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో వైసీపీకి చెందిన జడ్పీటీసీ సురవరపు నాగేశ్వర రావు షలంత్రి, ఎంపీటీసీ శివ్వాల సూ ర్యనారాయణ, టీడీపీ సభ్యులు మధ్య వా గ్వాదం చోటుచేసుకుని కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు స రుబుజ్జిలి గ్రామ సచివాలయ భవనంలో మహిళకు ప్రభుత్వం వంద కుట్టుమి షన్లు అందించడంతో శిక్షణ కార్యక్రమా న్ని, స్థానిక పీహెచ్‌సీ సమీపంలో కొత్త గా నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సీమీక్షలో తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదన్‌, ప్రత్యేకాహ్వా నితుడు కేవీజీ సత్యనారాయణ, ఈవోపీఆర్డీ రామారావు, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:36 AM