Share News

తాబేళ్ల మృత్యువాతపై విచారణ: ఎమ్మెల్యే శంకర్‌

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:58 PM

శ్రీకూర్మనాఽథుని క్షేత్రంలో తాబేళ్లు మృత్యువాతపై విచారణ నిర్వహిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. సోమవారం శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత, దహనం జరిగిన ప్రదేశాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.

 తాబేళ్ల మృత్యువాతపై విచారణ: ఎమ్మెల్యే శంకర్‌
అధికారులతో మాట్లాడుతున్న శంకర్‌:

గార, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మనాఽథుని క్షేత్రంలో తాబేళ్లు మృత్యువాతపై విచారణ నిర్వహిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. సోమవారం శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత, దహనం జరిగిన ప్రదేశాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా తాబేళ్ల పార్కు నిర్వ హణపై గ్రీన్‌మెర్సి స్వచ్ఛందసంస్థకు చెందిన రమణమూర్తి, ఆలయ అధికారులను అడిగితెలుసుకున్నారు.తాబేళ్ల మృతదేహా లకు పోస్టు మార్టం నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తాబేళ్లు మృతిచెందడం, దహనం చేసిన స్థలాన్ని కలెక్టర్‌ ఆదేశాల మేరకు దేవదాయశాఖ సహా య కమిషనర్‌ వై.భద్రాజీ, జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఎ.వెంకటేష్‌, పశువైద్య శాఖ జేడీ రాజశేఖర్‌, డీడీ రామమోహనరావు, సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ ఆర్‌.జనార్దన్‌, తహసీల్దార్‌ఎం.చక్రవర్తి పరిశీలించారు. అక్కడ 28 వరకు తాబేళ్ల మృతకళేబరాలు అధికారులు గుర్తించారు. వీటిలో ఎనిమిది తాబేళ్ల మృత కళేబ రాలు పశువైద్యశాఖ అధికారులు పోస్ట్‌ మార్టం నిర్వహిం చడానికి తీసుకువెళ్లారు. పార్కులో ఉన్న తాబేళ్లను సంరక్షించ డంపై తమశాఖ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తామని జిల్లా అటవీశాఖఅధికారి వెంకటేష్‌ తెలిపారు. ఇక్కడ భక్తులు, ఆలయ అధికారులు అభిప్రాయాలను తీసుకొని వివరాలు పంపి వారి ఆదేశాలు మేరకు తగిన చర్యలు తీసుకుం టామని చెప్పారు. అలాగే తాబేళ్లు మృత్యువాత పడడంతో దహనం చేసిన స్థలాన్ని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ప్రధానకార్యదర్శి శ్రీరంగం మధుసూద నరావు, ప్రతినిధులు పరిశీలించారు. ఇటువంటి చర్యలు పునరా వృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Apr 21 , 2025 | 11:58 PM