Share News

ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:01 AM

ఎన్‌హెచ్‌ఎం కింద కమ్యూనిటీ హెల్త్‌ అధికారులుగా పనిచేస్తున్న తమకు రెండేళ్లుగా జీతాలు సరిగ్గా రావడం లేదని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఉషారాణి ఆందోళన వ్యక్తంచేశారు. సకాలంలో జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్ర తను కల్పించాలని కోరారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
జ్యోతిబాపూలే పార్కువ ద్ద ధర్నా నిర్వహిస్తున్న సీహెచ్‌వోలు :

అరసవల్లి, ఏప్రిల్‌22(ఆంధ్రజ్యోతి): ఎన్‌హెచ్‌ఎం కింద కమ్యూనిటీ హెల్త్‌ అధికారులుగా పనిచేస్తున్న తమకు రెండేళ్లుగా జీతాలు సరిగ్గా రావడం లేదని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఉషారాణి ఆందోళన వ్యక్తంచేశారు. సకాలంలో జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్ర తను కల్పించాలని కోరారు. మంగళవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌ వద్ద గల మహాత్మా జ్యోతిబాపూలే పార్కు ఆవరణలో ధర్నా నిర్వ హించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యనిర్వాహణ అధ్యక్షుడు సీహెచ్‌ రాజీవ్‌, జి.రాఘవ, సీహెచ్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:01 AM