Share News

కూలీల కొరతకు.. యాంత్రీకరణే పరిష్కారం

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:41 PM

యాంత్రీకరణ ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చునని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టరు పీవీ సత్యనారాయణ తెలిపారు.

కూలీల కొరతకు.. యాంత్రీకరణే పరిష్కారం
ఖరీఫ్‌-రబీకి సంబంధించిన వివరాలను విడుదల చేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): యాంత్రీకరణ ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చునని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టరు పీవీ సత్యనారాయణ తెలిపారు. ఉత్తర కోస్తాలోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వ్యవసాయ పరిశోధన, విస్తర ణ మండలి సమావేశం సోమవారం జడ్పీ సమావేశ భవనంలో నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో భాగంగా తొలిరోజు ఖరీఫ్‌, రబీకి సంబంధించిన వివిధ పంటలు, కొత్త వంగడాలు, అధునాతన వ్యవసాయ పద్ధతులు వ్యవసాయ యాంత్రీకరణ, చీడపురుగుల నివారణ తదితర అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులను వివరించారు. అనంతరం డాక్టరు పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తర కోస్తాలోని నాలుగు జిల్లాల్లో వ్యవసాయ యాజమాన్య పనుల్లో నాణ్యమైన శిక్షణ అందిస్తామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తి పెరిగేందుకు మరింతగా వీలుందన్నారు. మొక్కజొన్న వంటి పంటల్లో ఇంకా వృద్ధి సాధించవలసి ఉందని చెప్పారు.
-విస్తరణ సంచాలకులు డాక్టరు శివన్నారాయణ మాట్లాడుతూ అభ్యుదయ రైతుల పొలాల్లో మినీకిట్లు, ప్రదర్శన కేంద్రాలు, పరిశీలనలు రైతుల భాగస్వామ్యంతో ఇంకా పెరగాలన్నారు. రైతు సేవా కేంద్రాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
-వైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టరు భరతలక్ష్మీ మాట్లాడుతూ నువ్వులలో కలుపు యాజమాన్యం గురించి రైతాంగం గుర్తించాలన్నారు.
-నాబార్డు డీడీఎం నాగార్జున మాట్లాడుతూ యువత వ్యవసాయం వైపు మళ్లాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పెరగాలని అన్నారు.
-శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహించాలన్నారు.
-వరి, అపరాలు, నూనెగింజలు, మొక్కజొన్న, చిరుధాన్యా లు, మెట్ట వ్యవసాయం, కలుపుశాస్త్రం, యాంత్రీకరణ తదితర అంశాలపై ప్రధాన శాస్త్రవేత్తలు రైతుల నుంచి వచ్చిన సందే హాలను నివృత్తి చేశారు.
-విజయనగరం జిల్లా వ్యవసాయాధికారి వీటి రామా రావు మాట్లాడుతూ వ్యవసాయం ద్వారా మరింత అధికోత్పత్తి రావాలన్నారు. అభ్యుదయ రైతులు మాట్లాడుతూ అనుబంధ రంగాలైన మేకలు, పాడిపశువుల పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్నట్టు వివరించారు.
-రెండోరోజైన మంగళవారం ఉద్యానవన, పట్టు పరిశ్రమలకు సంబంధించి సమావేశం జరగనుంది. కార్య క్రమం అనంతరం ఖరీఫ్‌-రబీ (2025-26)కి సంబంధించి న ప్రణాళికను శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు విడుదల చేశారు.
తొలి రోజు తీర్మానాలు ఇవే..
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అభ్యుదయ రైతులు, వ్యవసాయాధికా రులు, శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వీటి సాధనకు కృషి చేయాలని సమావేశం నిర ్ణయించింది.
తీర్మానాలు ఇవే..
-చిన్న కమతాలకు సంబంఽధించి యాంత్రీకరణ జరగాలి. ఫ వేసవిలో కూడా పంటలు పండించాలి. ఈ దిశగా రైతులను సమాయత్తం చేయాలి. ఫ యువత వ్యవసాయానికి వచ్చేలా అవగాహన కల్పించాలి. వారికి ఈ రంగంలో కూడా ఆదాయం ఎలా వస్తుందన్నదానిపై వివరించాలి. ఫ వ్యవసాయ రంగంలో నైపుణ్యం పెంచేందుకు యువత కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఫ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యసాయా నికి ఉపయోగించే అన్ని పనులు నిర్వహించాలి.. చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి.

Updated Date - Apr 21 , 2025 | 11:41 PM