Share News

జనావాసాల్లో మద్యం దుకాణం వద్దు

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:01 AM

పాతపట్నంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో గల జనావాసాల్లో గీతకార్మికులకు కేటాయించిన మద్యం దుకాణం ఏర్పాటుపై స్థానికులు, మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు.

జనావాసాల్లో మద్యం దుకాణం వద్దు
నిరసన తెలుపుతున్న హౌసింగ్‌బోర్డు కాలనీలోని మహిళలు:

పాతపట్నం, ఏప్రిల్‌ 24(ఆంఽధ్రజ్యోతి): పాతపట్నంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో గల జనావాసాల్లో గీతకార్మికులకు కేటాయించిన మద్యం దుకాణం ఏర్పాటుపై స్థానికులు, మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కోర్టు, పోలీస్‌స్టేషన్‌, సమీకృత బాలుర వసతిగృహం, ఎంపీ డీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌, వెలుగు,ఉపాధి, హౌసింగ్‌ కార్యాలయాలు, 50 పడకల ఆసుపత్రిఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏలా ఏర్పాటుచేస్తారని ప్రశ్నించారు. మద్యం దుకాణం నిర్వహణకు అనుమతులు విరమించుకోవాలని కోరారు. అవసరమైతే నిరాహార దీక్షలకైనా వెనుకాడబోమని మహిళలు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్‌బోర్డుకాలనీవాసులు, విశ్రాంత ఎంపీడీవో సలాన చిరంజీవి, బీజేపీ నాయకుడు దుక్క శ్రీకాంత్‌ ,విశ్రాంతఉపాధ్యాయుడు రేగేటి ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:01 AM