Share News

ఒడిశా టు తమిళనాడు

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:38 PM

ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయి తమిళనాడుకు తరలిస్తుండగా పట్ట ణ ఎస్‌ఐ ముకుందరావు స్వాధీనం చేసు కున్నట్లు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు.

ఒడిశా టు తమిళనాడు
మాట్లాడుతున్న సీఐ చిన్నమనాయుడు

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయి తమిళనాడు కు తరలిస్తుండగా పట్ట ణ ఎస్‌ఐ ముకుంద రావు స్వాధీనం చేసు కున్నట్లు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. గురువారం సర్కిల్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా డుతూ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన నరేష్‌ సీతీ, గోపినాఽథన్‌ తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌ ప్రాంతంలో నివాసముంటున్నారు. అక్కడ గంజాయి వ్యాపారం చేసే లారెన్స్‌ ప్రధాన్‌తో వీరికి పరిచయం ఏర్పడింది. గంజాయిని తీసుకొని వస్తే కిలోకి రూ.7 వేలు ఇస్తామని చెప్పా డు. దీంతో వీరిద్దరూ ఆయన చెప్పిన విధంగా ఒడిశా వెళ్లి ఇవాల్‌ మజ్జి అనే వ్యక్తి వద్ద సుమారు 10.5 కిలోల గంజాయి కొనుగోలు చేసి బస్సులో ఇచ్ఛాపురం బస్టాండ్‌కు వచ్చారు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పట్టణ ఎస్‌ఐ ముకుందరావు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపడుతూ వీరి వద్ద ఉన్న మూటలను పరిశీలించారు. గంజా యిగా గుర్తించి అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. వారి నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు సీజ్‌ చేశామన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:38 PM