‘ఆపరేషన్ రెడ్ క్యాప్’ గుట్టురట్టు
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:18 AM
గూఢాచారి సినిమాలో స్మగ్లర్లు సరకులు గమ్యస్థానానికి చేర్పించేందుకు రకరకాల వేషాలు చేస్తుంటారు.
పలాస, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): గూఢాచారి సినిమాలో స్మగ్లర్లు సరకులు గమ్యస్థానానికి చేర్పించేందుకు రకరకాల వేషాలు చేస్తుంటారు. సరుకులు అందించే వారి వివరాలు వెల్లడించ కుండా టోపీలు, దుస్తులు వంటి ఐడెంటెంటీని చెబుతూ వారికి సరకులు అప్పగిస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం ఆ సినిమా మాదిరి గానే గంజాయి స్మగ్లర్లు ఆపరేషన్ రెడ్‌క్యాప్ పేరు తో నిర్వహించిన ఆపరేషన్‌ను కాశీబుగ్గ పోలీసులు గుట్టురట్టుచే శారు. శనివారం సాయంత్రం పలాస రైల్వే స్టేషన్ రోడ్డులో పది కిలోల గంజాయి తరలి స్తున్న ఇద్దరు ఒడిశావాసులను పట్టుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు కథనం మేరకు.. ఒడిశాలోని ఆర్.ఉదయగిరికి చెందిన తపన్‌బెబర్త, మననిత్‌సింగ్‌లు క్రికెట్‌లో పరిచ యమై స్నేహితులుగా మారారు. వీరు చెడువ్యవస నాలకు బానిసై గంజాయి రవాణాకు అలవాటు పడ్డారు. హైదరాబాద్‌లో అమ్మకందారులకు గంజాయిఇస్తే రూ.10వేలు కమీషన్ వస్తుండడంతో ఆ స్మగ్లింగ్‌కు అలవాటుపడ్డారు.ఈ క్రమంలో ఇద్దరూ గంజాయి కొను గోలు చేసుకొని పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. గంజాయి అమ్మకం దారులు పలాసలో రైల్వే స్టేషన్‌కు రావడంతో వారిని గుర్తించడానికి ఆనవాళ్లు చెప్పడంతో ఆ విధంగా గంజాయిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎరుపు రంగు టోపీ వ్యక్తికి గంజాయి బ్యాగును ఇవ్వాల్సి ఉంది. ఆ క్రమంలో ఎరుపు టోపీ వ్యక్తికోసం వెతుకుతుండడంగా తనిఖీలు నిర్వహిస్తున్న కాశీబుగ్గ సీఐ పి.సూర్య నారాయణ, సిబ్బంది కంట పడ్డారు. వెంటనే బ్యాగులను పరిశీలించగా గంజాయి బయట పడింది. విషయం ఆరా తీయడంతో ఆపరేషన్ రెడ్ క్యాప్ వ్యవహారం గుట్టురట్టయ్యింది.దీంతో పోలీసులు వారి తెలివితేటలకు విస్తుపోయారు. నిందితులను అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులకు డీఎస్పీ అభినందించారు.