srikurmam: వారసత్వ సంపదను కాపాడుకోవాలి
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:12 AM
Traditional Knowledge పూర్వీకులు నిర్మించిన వారసత్వ సంపదను కాపాడుకుంటూ.. భావితరాలకు దానిని అందించే ప్రయత్నం చేయాలని శ్రీకూర్మం క్షేత్రం వంశపార్య ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు
గార, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): పూర్వీకులు నిర్మించిన వారసత్వ సంపదను కాపాడుకుంటూ.. భావితరాలకు దానిని అందించే ప్రయత్నం చేయాలని శ్రీకూర్మం క్షేత్రం వంశపార్య ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యవాత పడిన సమాచారం తెలిసి మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. కూర్మనాథ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. తాబేళ్లు మృత్యవాత పడిన స్థలాన్ని, తాబేళ్ల పార్క్‌ను పరిశీలించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మంలో తాబేళ్లు కూడా స్వామికి దగ్గరగా ఉండాలని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శ్రీకూర్మం క్షేత్రానికి సంబంధించిన అభరణాలు సింహాచలం దేవస్థానంలో ఉన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకూర్మంలోని ఆలయంలో ఒక లాకర్ ఏర్పాటు చేసి ఆభరణాలను భద్రపరచాలని అధికారులను అశోక్‌గజపతిరాజు ఆదేశించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత, సహాయ కమిషనర్ వై.భద్రాజీ పాల్గొన్నారు.