Share News

సర్దార్‌ సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:02 AM

స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న సేవలను చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. శనివారం జిల్లాలో లచ్చన్న వర్థంతి పురస్కరించుకుని పలుచోట్ల ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనచేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.

సర్దార్‌ సేవలు చిరస్మరణీయం
వజ్రపుకొత్తూరు:లచ్చన్న విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు:

స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న సేవలను చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. శనివారం జిల్లాలో లచ్చన్న వర్థంతి పురస్కరించుకుని పలుచోట్ల ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనచేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.

ఫకోటబొమ్మాళి ఏప్రిల్‌19(ఆంధ్రజ్యోతి):బడుగు బలహీనవర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్పఉద్యమకారుడు సర్దార్‌ గౌతు లచ్చన్న అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నిమ్మాడలోని తనకార్యాలయంలో గౌతు లచ్చన్న 19వ వర్థంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు.

ఫనరసన్నపేట, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి):నరసన్నపేటలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ శ్రీశయన సంఘనాయకులు తోట చంద్రమోహన్‌దేవ్‌, రాష్ట్ర కల్లుగీత సంఘ ప్రధాన కార్యదర్శి దుబ్బ కోటేశ్వరరావు, సంఘ నాయకులు దంత త్రినాథరావు, డొంకాన అసిరినాయుడు, వంజల రామరాజు, కోల రాము, బతకల గోపి,సరియపల్లి మధు, డొంకాన మణి పాల్గొన్నారు.

ఫవజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రెయ్యిపాడులోని గౌతు లచ్చన్న విగ్రహానికి టీడీపీ మండలాధ్యక్షులు సూరాడ మోహనరావు, అగ్నికులక్షత్రియ డైరక ్టర్‌ పుచ్చ ఈశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫపలాస, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): పలాసలోని కేటీరోడ్డులో గల సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహానికి టీడీపీనాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి, ఏపీటీపీసీ చైర్మన్‌ బాబూరావు,కామేశ్వరరావుయాదవ్‌, విఠల్‌రావు పాల్గొన్నారు.

ఫసోంపేట, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):సర్దార్‌ గౌతు లచ్చన్న వర్థంతి సందర్భంగా సోంపేటలోని ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. మాజీ మంత్రి గౌతుశివాజీ, విజయమ్మతో కలసి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విప్‌ బెందాళం అశోక్‌లు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఫ కంచిలి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): మఠం కంచిలిలోని లచ్చన్న విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి టీడీపీ నాయకులు నివాళులర్పించారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు బంగారు కురయ్య, టీడీపీ మండల ప్రచార కార్యదర్శి జగదీష్‌ పట్నాయక్‌, మురళీ పట్నాయక్‌, కొర్రాయి కురయ్య, పైల మన్మథరావు, లండ లోకనాథం, జగన్నాఽథరావు పాల్గొన్నారు.

ఫహరిపురం ఏప్రిల్‌19 (ఆంధ్రజ్యోతి):మందస, హరిపురం కూడళ్లలో గౌతు లచ్చన్న వర్థంతిని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు బావన దుర్యోధన, నాయకులు జీకే నాయుడు, లబ్బ రుద్రయ్య, దాసరి తాతారావు, రట్టి లింరగాజు,గున్నయ్య, బమ్మిడి కర్రయ్య, భాస్కరరావు, పుల్లా వాసు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:02 AM