ఆప్కాస్‌లోనే కొనసాగించాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:03 AM
ఔట్‌సోరింగ్ ఉద్యోగులను ఆప్కాస్‌లోనే కొనసాగించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సూరయ్య డిమాండ్ చేశారు.
అరసవల్లి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఔట్‌సోరింగ్ ఉద్యోగులను ఆప్కాస్‌లోనే కొనసాగించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సూరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం స్థానిక నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీతాలు పెంచాలని, పదవీ విరమణ వయసు 62కు పెంచాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, కార్మికులకు పనిముట్లు, సెలవులు ఇవ్వాలని కోరారు. నగర పరిధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, నాయకులు కె.రాజు. ఎ.శంకర్, యుగంధర్, రాజశేఖర్, చిట్టి, దేవసంతోష్, పార్వతి, మాధవి, ఈశ్వరమ్మ, మల్లెమ్మ, ఇంజనీరింగ్ నాయకులు గిరిజాశంకర్, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.