Share News

సమష్టిగా సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:27 PM

గ్రామాల్లోని సమస్యలను పార్టీలకు అతీతంగా సమష్టిగా పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

సమష్టిగా సమస్యల పరిష్కారం
పోలాకి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని సమస్యలను పార్టీలకు అతీతంగా సమష్టిగా పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యా లయ సమావేశ మందిరంలో ఎంపీపీ ముద్దాడ దమయంతి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత రాజకీయం మరిచి పోవాలని, పార్టీ విభేదాలుండకూడదన్నారు. పలువురు సభ్యులు తెలిపిన సమస్యలను విన్న ఆయన తీవ్రంగా స్పందించారు. అన్నిరకాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం అవస రమన్నారు. మండలంలో ఉపాధి హామీ పనుల తీరుపై ఏపీవోని పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. సమా వేశంలో జడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య, డీఈవో తిరుమలచైతన్య, తహసీల్దార్‌ మంగి సురేష్‌కుమార్‌, ఎంపీడీవో రవికుమార్‌, గ్రామీణ నీటి సరఫ రా ఇంజనీర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పిల్లలు వద్దకునేవారు ఊయలలో వేయండి

నరసన్నపేట, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): పిల్లలు వద్దనుకునేవారు సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం స్థానిక ఆసుపత్రిలో ఊయల కార్యక్రమం ప్రారంభించారు. బాలింతలకు పండ్లు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాళింగ కార్పోరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, ఆసుపత్రి అభివృద్ధికమిటీ సభ్యుడు శిమ్మ జగన్నాథం, ఐసీడీఎస్‌ పీవో నాగమణి, ఏపీవో లావణ్య, ఆసుపత్రి సూపరెండెంట్‌ శ్రీనివాసబాబా, పలువురు టీడీపీ నేతలు, వైద్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రమణమూర్తి కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించారు.

Updated Date - Apr 16 , 2025 | 11:27 PM