Share News

Special recognition టీడీపీ సభ్యత్వంతో ప్రత్యేక గుర్తింపు: బగ్గు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:53 PM

Special recognition దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని, ఈ పార్టీలో సభ్వత్వం తీసుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

 Special recognition  టీడీపీ సభ్యత్వంతో ప్రత్యేక గుర్తింపు: బగ్గు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని, ఈ పార్టీలో సభ్వత్వం తీసుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శుక్రవారం సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అధిష్ఠానం ప్రత్యేక గుర్తింపునిస్తుందన్నారు. నియోజకవర్గంలో 11 వేలు పైచిలుకు పార్టీ సభ్యత్వాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్‌ బగ్గు అర్చన, పార్టీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, కన్వీనర్‌ బగ్గు గోవిందరావు, నాయకులు పంచిరెడ్డి రామచంద్రరావు, దుంగ స్వామిబాబు, ఎం.దామోదరరావు, కింజరాపు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:53 PM