Share News

The CM's visit సీఎం పర్యటనలో ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:27 AM

The CM's visit ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 26న ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున ఎక్కడ ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేప ట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు పేర్కొన్నా రు.

The CM's visit    సీఎం పర్యటనలో ఇబ్బందులు లేకుండా చూడాలి

మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 26న ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నిమ్మా డ క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం మత్య్సకార భరోసా పథ కాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందున నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ చిన్న విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించేందుకు వీల్లేదన్నారు. సభా వేదిక వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవా లని, భద్రతా బలగాలు అణువణువూ గాలించి ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సీఎం పర్య టనకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రొటోకాల్‌ నిబంధన లను పాటిస్తూ జిల్లా ప్రజా ప్రతినిధులను పోలీసులు సభా ప్రాంగణంలో రిసీవ్‌ చేసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 24 , 2025 | 12:27 AM