Share News

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:42 PM

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువా రం టెక్కలి ఇందిరాగాంధీ కూడలిలో రూ.61 లక్షలతో తలపెట్టిన అన్న క్యాంటీన్‌ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న క్యాం టీన్‌ అందరికీ ఆకలి తీరుస్తుందని తెలిపారు. అనంతరం లింగాలవలస గ్రామంలో సీసీ రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిం చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామీణ రోడ్లు ఛిద్రమయ్యాయని, కనీస మరమ్మతులు చేపట్ట లేదని ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు మెరు గైన వైద్యసేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో మల్టీస్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణానికి కూడా చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. అనంతరం లింగాల వలసలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్య కర్తలే పార్టీకి పునాదులని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కింజ రాపు హరిప్రసాద్‌, బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, ఎల్‌ఎల్‌ నాయడు, చౌదరి బాబ్జీ, హనుమంతు రామకృష్ణ, లవకుమార్‌, రాము, సంపతిరావు రాఘవరావు, సంపతిరావు రవీంద్ర, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:42 PM