ఘనంగా ఇప్పలపోలమ్మ పాలజంగిడి ఊరేగింపు
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:00 AM
మన్యం జిల్లా కేంద్ర ప్రజల ఇలవేల్పు ఇప్పల పోలమ్మ అమ్మవారి పాలజంగిడిని స్థానిక పద్మశ్రీ థియేటర్ సమీపంలో గల వనం గుడి నుంచి నాయుడు వీధిలో గల ప్రధాన ఆలయానికి మేళాతాళాలతో తీసుకువచ్చారు.
పార్వతీపురం టౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా కేంద్ర ప్రజల ఇలవేల్పు ఇప్పల పోలమ్మ అమ్మవారి పాలజంగిడిని స్థానిక పద్మశ్రీ థియేటర్ సమీపంలో గల వనం గుడి నుంచి నాయుడు వీధిలో గల ప్రధాన ఆలయానికి మేళాతాళాలతో తీసుకువచ్చారు. సోమవారం రాత్రి ఇప్పలపోలమ్మ అమ్మవారి పాల జంగిడికి వనం గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఆలయం వరకు అమ్మవారి పాలజంగిడిని ఘనంగా ఊరేగించారు.