Share News

సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర: ఎమ్మెల్యే శంకర్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:57 PM

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు

సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర: ఎమ్మెల్యే శంకర్‌
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌:

అరసవల్లి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలోని సీపన్నాయుడుపేట, ఫాజుల్‌బాగ్‌పేట ప్రాంతాల్లో పల్లెనిద్ర కార్యక్రమంలో పర్యటించి, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ ప్రసాదరావ పాల్గొన్నారు.

ఫ సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు.బుధవారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో గల జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా గార, శ్రీకాకుళం మండలాల నుంచి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యత అని తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 11:57 PM