Share News

నిర్వాసితులను ఆదుకుంటాం

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:25 PM

నిర్వాసితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

నిర్వాసితులను ఆదుకుంటాం
మెళియాపుట్టి: నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గోవిందరావు

మెళియాపుట్టి,ఏప్రిల్‌16(ఆంధ్రజ్యోతి): నిర్వాసితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం చీపురుపల్లి, దాసుపురం, అర్చనాపురం గ్రామాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడారు. తమకు పూర్తిస్థాయి ప్యాకేజీ అందలేదని, కనీసం నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించలేదని నిర్వాసితులు అన్నారు. దాసుపురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో రోడ్లు, కాలువలు, పాఠశాల నిర్మాణం జరగక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్‌ పాపారావు, ఎంపీడీవో నరసింహప్రసాద్‌ పండా తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలే పార్టీ పట్టుకొమ్మలు

పాతపట్నం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలే పార్టీ పట్టుకొమ్మలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యా లయంలో బుధవారం ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమం నిర్వహించారు, కష్టకాలంలో నిలిచిన కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. పారీ ్టకోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఇటీవల పార్టీసభ్యత్వ నమోదులో ఉత్తమ ఫలితాలు సాధిం చిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:25 PM