భోజన పదార్థాలు ఇలాగే ఉంటాయా?
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:35 PM
విద్యార్థినులకు అందించే భోజన పదార్థాలు ఇలాగే ఉంటాయా అని ప్రశ్నిస్తూ ఆహారం నాణ్యత గా లేకపోవడంపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాతపట్నం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): విద్యార్థినులకు అందించే భోజన పదార్థాలు ఇలాగే ఉంటాయా అని ప్రశ్నిస్తూ ఆహారం నాణ్యత గా లేకపోవడంపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బొమ్మిక గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోజన నిర్వహణ దారుణంగా ఉందని, ఇది పునరావృతమైతే చర్యలు తప్పవని సిబ్బం దికి హెచ్చరించారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. బోధనా ప్రమాణాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థినుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నా ..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తెంబూరు రోడ్డు నుంచి సింగుపురం మీదుగా రట్టిపేట గ్రామం వరకు రూ.1.60 కోట్ల ఉపాధి నిధులతో చేపట్టిన బీటీ రోడ్డును గురువారం ప్రారంభించారు. అలాగే సింగు పురంలో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మిస్తున్న నీటితొట్టెల పనుల ను పరిశీలించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పశువులకు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయని, పనులను త్వరిత గతిన చేపట్టాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం గా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందన్నారు. కార్యక్ర మాల్లో టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, సిరిపురం గంగాధర్, శ్రీరామ్ రమణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.