Share News

Olive Ridley: చిట్టి చిట్టి అడుగులతో..

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:20 PM

Olive Ridley: చిట్టి చిట్టి అడుగులతో ఆ చిన్ని జీవులు సాగరం ఒడిలోకి వెళుతుంటే... వాటిని తన పొత్తిళ్ల లోకి తీసుకునేందుకు సంద్రమమ్మ తన కెర టాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యం చూపరులకు ముచ్చటగొల్పింది.

Olive Ridley:  చిట్టి చిట్టి అడుగులతో..
సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను విడిచిపెడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- సాగరంలోకి తాబేళ్ల పిల్లలు

-ఆలివ్‌ రిడ్లేలను విడిచిపెట్టిన కలెక్టర్‌

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): చిట్టి చిట్టి అడుగులతో ఆ చిన్ని జీవులు సాగరం ఒడిలోకి వెళుతుంటే... వాటిని తన పొత్తిళ్ల లోకి తీసుకునేందుకు సంద్రమమ్మ తన కెర టాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యం చూపరులకు ముచ్చటగొల్పింది. బొంతల కోడూరు పంచాయతీ పాతదిబ్బలపాలెం తీరంలో ఏర్పాటుచేసిన తాబేలు సంరక్షణా కేంద్రంలోని ఆలివ్‌ రిడ్లే పిల్లలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ బుధవారం సము ద్రంలోకి విడిచిపెట్టారు. చెన్నైకు చెందిన టి-ఫౌండేషన్‌ సంస్థ సహకారంతో స్థానిక మత్స్యకారులు మైలపల్లి సందయ్య, చోడిపల్లి లక్ష్మణరావులు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నా రు. ఈ కేంద్రంలో జనవరి నుంచి మే నెల వరకు తాబేలు గుడ్లను పొదిగించి.. పిల్లలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతు న్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో వెంకటేష్‌, ఫారెస్ట్‌ రేంజర్‌ రాజశేఖర్‌, టి-ఫౌండేషన్‌ ప్రతి నిధులు కె.సోమేశ్వరరావు, ఉపేంద్ర, సర్పంచ్‌ పంచిరెడ్డి రాంబాబు, ఎంపీటీసీ మాడుగుల జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 280 తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచి పెట్టారు.


బారువ బీచ్‌లో కలెక్టర్‌ పర్యటన

సోంపేట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): బారువబీచ్‌ ఫెస్టివల్‌ ఘనంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సూచించారు. బారువ బీచ్‌ను బుధవారం ఆయన పరీశిలించారు. ఈ సందర్భంగా బీచ్‌ఫెస్టివల్‌కు విస్తృతంగా ప్రచారం కల్పించి... ఘనంగా నిర్వహించేలా చూడాలని కోరారు. ఆయన వెంట జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, పలాస ఆర్డీవో గ్రంధి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

నేడు చిత్రలేఖన పోటీలు

గుజరాతీపేట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంరక్షణపై అన్ని మండ లాల్లో గురువారం చిత్రలేఖన పోటీలు నిర్వ హించనున్నట్లు డీఈవో ఎస్‌.తిరుమలచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మం డల స్థాయిలో గెలుపొందిన వారికి శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు బహుమతులు ప్రదా నం చేస్తామన్నారు. 19న తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

Updated Date - Apr 16 , 2025 | 11:20 PM