Share News

త్వరలో సీఐలకు పదోన్నతి

ABN , Publish Date - Jan 23 , 2025 | 05:23 AM

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే సీఐలకు, డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాల్లో డీజీపీ పర్యటించారు.

త్వరలో సీఐలకు పదోన్నతి

మహిళలపై నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు: డీజీపీ

కర్నూలు క్రైం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే సీఐలకు, డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాల్లో డీజీపీ పర్యటించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్‌తో కలిసి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మీడియాతో మాట్లాడారు. ‘విదేశాల్లో వాడుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని జిల్లా పోలీసు శాఖ కొత్త తరహాగా పని చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్త నేరాలు వస్తుండటంతో వాటిని అరికట్టేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పోలీసు బృందం ఏర్పాటు చేశాం. ఈ పోలీసు బృందాలు సంఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి.’ అని తెలిపారు. డీఐజీ వెంట కర్నూలు ఎస్పీ బిందుమాధవ్‌, నంద్యాల ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తదితరులు ఉన్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లిన రైలు: పలువురు మృతి

Also Read: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం

Also Read: : గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్

Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్

Also Read: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 23 , 2025 | 05:23 AM