Share News

Ram Mohan Naidu: విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:34 AM

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని అభిలషించారు. కేఎస్‌పీపీ పట్టాభద్రుల దినోత్సవంలో 30 మంది విద్యార్థులకు మాస్టర్స్‌ డిగ్రీలు ప్రదానం చేశారు

Ram Mohan Naidu: విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి

  • కేఎస్‌పీపీ పట్టాల ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థులంతా ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అభిలషించారు. కౌటిల్యా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ(కేఎ్‌సపీపీ) తృతీయ పట్టభద్రుల దినోత్సవాన్ని బుధవారం హైదరాబాద్‌ గీతం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. 30మంది విద్యార్థులకు పబ్లిక్‌ పాలసీలో మాస్టర్స్‌ డిగ్రీలను ప్రదానం చేశారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను ఇచ్చి సత్కరించారు. మాస్టర్స్‌ డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులను గీతం అధ్యక్షుడు, ఎంపీ ఎం.శ్రీ భరత్‌ అభినందించారు. మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఒయిషిక్‌ భట్టాచార్యను గీతం అధ్యక్షుడి పేరిట ఏర్పాటు చేసిన బంగారు పతకంతో సత్కరించారు. కేఎస్‌పీపీ డీన్‌, ఐక్యరాజ్యసమితిలో భారతదేశ పూర్వ శాశ్వత ప్రతినిధి ప్రొఫెసర్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌, గీతం రిజిస్ట్రార్‌ డి.గుణశేఖరన్‌, కేఎ్‌సపీపీ సహా వ్యవస్థాపకుడు ప్రతీక్‌ కన్వాల్‌, వీసీ ప్రొఫెసర్‌ ఎర్రోల్‌ డిసౌజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 05:34 AM