Tirumala: అలిపిరి నిఘాపై ఫోకస్
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:47 AM
తిరుమల ఆలిపిరి టోల్‌గేట్‌లో జరిగిన నిఘా తనిఖీలో ఎస్పీ హర్షవర్ధనరాజు నిర్లక్ష్యం చూపిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగేజీ స్కానర్ వద్ద పర్యవేక్షణలో తగిన దృష్టి లేకపోవడం, సెక్యూరిటీలో లోపాలు గుర్తించారు

టోల్‌గేట్ వద్ద ఎస్పీ తనిఖీలు.. కొందరు సిబ్బంది తీరుపై ఆగ్రహం
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి టోల్‌గేట్ వద్ద నిఘాపై టీటీడీ, పోలీసులు దృష్టిపెట్టారు. ఇక్కడ సిబ్బంది పనితీరుపై టీటీడీ సీవీఎస్వో(ఎ్‌ఫఏసీ) గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అలిపిరిలో నిఘా వైఫల్యాలను ప్రస్తావిస్తూ ‘తిరుమల ఎంత భద్రం’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బందితో కలసి దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు చేశారు. లగేజీ స్కానర్ వద్ద సిబ్బందికి కనిపించకుండా నిలబడి వాహనాలు, సామగ్రిని ఎలా తనిఖీ చేస్తున్నారో గమనించారు. తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News