Share News

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట బాధితులకు ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:58 AM

తిరుపతిలో ఈ నెల ఎనిమిదో తేదీన జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఆదివారం టీటీడీ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట బాధితులకు ఎక్స్‌గ్రేషియా

బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కుల పంపిణీ

విశాఖపట్నం/ నర్సీపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఈ నెల ఎనిమిదో తేదీన జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఆదివారం టీటీడీ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ తొక్కిసలాటలో విశాఖలోని మద్దిలపాలేనికి చెందిన గుడ్ల రజని, సూరిశెట్టి లావణ్య, కందిపల్లి శాంతి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన బొడ్డేటి నాయుడుబాబు మృతిచెందారు. గుడ్ల రజని భర్త లక్ష్మణరెడ్డి, కందిపల్లి శాంతి భర్త వెంకటేశ్‌, లావణ్య భర్త సతీశ్‌, వారి పిల్లలకు హోం మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ బాధిత కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందించారు. నర్సీపట్నం మునిసిపాలిటీలోని పెదబొడ్డేపల్లిలో బొడ్డేడ నాయుడుబాబు భార్య మణికుమారికి రూ.25 లక్షల చెక్కును శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అందజేశారు. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేలు కలిసి అందజేశారు.

Updated Date - Jan 13 , 2025 | 03:02 AM