Share News

Polavaram: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:39 PM

వైఎస్ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు

Polavaram: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు
Chandrababu polavaram

2027 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికి రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే, 2027 నవంబర్‌ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని కూడా సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.


పోలవరం ప్రాజక్టులో భూములు కోల్పోయిన బాధితులకు పునరావాసాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామన్నారు.

APCM-1.jpg

మన ఎన్డీయే ప్రభుత్వం వచ్చిందని, సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని అన్నారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్‌ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని చంద్రబాబు చెప్పారు.

APCM-2.jpg


వైఎస్ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

APCM-1.jpgపోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో బాబు ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.

Apcm.jpg

ఈ ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.


ఇవి కూడా చదవండి:

యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

చోరీ చేయడంలోనూ భార్యకు ట్రైనింగ్.. చివరకు ఇద్దరూ కలిసి..

Updated Date - Mar 27 , 2025 | 05:12 PM