Torture case : రఘురామ కేసులో తులసిబాబు అరెస్టు
ABN , Publish Date - Jan 09 , 2025 | 06:06 AM
రఘురామకృష్ణ రాజు సీఐడీ కస్టడీ హింస కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయన్ను
6 గంటల విచారణ అనంతరం అదుపులోకి
ఒంగోలుక్రైం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రఘురామకృష్ణ రాజు సీఐడీ కస్టడీ హింస కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయన్ను ప్రశ్నించిన ప్రకాశం ఎస్పీ దామోదర్.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. తులసిబాబును గురువారం ఉదయం గుంటూరు సీఐడీ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 వరకు తులసిబాబు, పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను ఒకేచోట కూర్చోబెట్టి ఎస్పీ విచారించారు. ఇద్దరూ దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. అయితే పక్కా సమాచారంతో పలురకాలుగా పశ్నించి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది. 9.30 తర్వాత విజయ్‌పాల్‌ను స్థానిక తాలూకా పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం తులసిబాబును ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు సమాచారం.