Share News

Amazon Job Offer : విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి అమెజాన్‌లో రూ.40 లక్షల వార్షిక వేతనం

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:38 AM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన సీఎ్‌సఈ విద్యార్థిని బయ్యన రేణు అక్షయకు అమెజాన్‌ కంపెనీలో రూ.40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌

Amazon Job Offer : విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి అమెజాన్‌లో రూ.40 లక్షల వార్షిక వేతనం

గుంటూరు(విద్య), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన సీఎ్‌సఈ విద్యార్థిని బయ్యన రేణు అక్షయకు అమెజాన్‌ కంపెనీలో రూ.40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.ఫణీంద్రకుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని రేణు అక్షయ తల్లిదండ్రులు డాక్టర్‌ బి.రాజీవ్‌, పద్మను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ విద్యార్థినిగా విజ్ఞాన్స్‌ లారాలో అడ్మిషన్‌ సాధించి నేడు అమెజాన్‌లో రూ.40 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థినిని పిన్సిపాల్‌ డాక్టర్‌ కె.ఫణీంద్ర కుమార్‌, ఉపాధి కల్పనాధికారులు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

Updated Date - Jan 12 , 2025 | 06:38 AM