పెద్దమ్మతల్లికి గ్రామోత్సవం
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:15 PM
మండలంలోని పొడరాళ్లపల్లి ఎస్సీకాలనీలో వెలసిన పెద్దమ్మతల్లికి సోమవారం గ్రామస్థులు గ్రామోత్సవం నిర్వహించారు.
ముదిగుబ్బ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని పొడరాళ్లపల్లి ఎస్సీకాలనీలో వెలసిన పెద్దమ్మతల్లికి సోమవారం గ్రామస్థులు గ్రామోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున పెద్దమ్మతల్లికి వెం డి కిరీటాలు, బంతిపూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వ హించారు. అనంతరం గ్రామ పురవీధులలో ఊరేగిస్తూ గ్రామో త్సవాన్ని నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం, చీరగాజులతో మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ పూజారి కంచర్ల రవి తీర్థప్రసాదాలు అందజేశారు.