23 మంది మందుబాబులకు జరిమానా
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:16 AM
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందికి కోర్టు రూ.2,30,000 జరిమానా విధించినట్టు గాజువాక ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు బుధవారం తెలిపారు.
గాజువాక, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందికి కోర్టు రూ.2,30,000 జరిమానా విధించినట్టు గాజువాక ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 24 మందిని కోర్టులో హాజరు పరచగా 23 మందికి ఒక్కొక్కరిరి రూ.10 వేల చొప్పున జరిమానా విధించిందని, ఒకరికి నాలుగు రోజుల పాటు జైలుశిక్ష విధించిందన్నారు.