జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జిల్లా పరిషత్ నిధులతో చేపడుతున్న పనులకు లేని ఇబ్బంది ఎలమంచిలి నియోజకవర్గంలో వస్తున్నదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులు చేయనివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు.
నాగపూర్ డివిజన్లో ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ, నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగించే సమతా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేశామని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని, భవిష్యతులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్టే్ట్రషన్ల శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
నగరంలో నేరాలను అరికట్టాల్సిన పోలీసు యంత్రాం గం జరిమానా వసూలు చేసే చట్టాలను అమలుచేయడంలో బిజీగా మారింది. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించినా సిగ్నళ్ల వద్ద పంచాయితీ పెడుతున్నారు. పాత చలానాలున్నాయా? అని పరిశీలించి చెల్లించేవరకు వదిలి పెట్టడం లేదు. తాజాగా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాలిస్తే (ధూమపానం) రూ.200 వరకు జరిమానా వేసే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసే చర్యలు చేపట్టడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసి వున్న మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొమ్మిదిన్నర తులాల బంగారం, 42 తులాల వెండి, కొంత నగదును అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవంలో సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని దేవదాయఽశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సింహాచలం గోశాల సమీప శ్రీనివాసనగర్‌లోని దేవస్థానం నూతన కల్యాణ మండపంలో బుధవారం చందనోత్సవ ఏర్పాట్లపై అన్నిశాఖల అఽధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఉన్నత సదుపాయాలు కల్పించి ఆధ్యాత్మికాంద్రప్రదేశ్గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికి అనుగుణంగా అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలు, తప్పిదాలపై కూలంకుషంగా అన్ని విభాగాల అధికారులతో చర్చించి, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈసారి రెండు పదవులనూ టీడీపీ నాయకులకు కట్టబెట్టింది. అనకాపల్లి ఏఎంసీ (ఎన్టీఆర్ మార్కెట్ యార్డు) చైర్మన్‌గా అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పచ్చికూర రాము, మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మాడుగుల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పుప్పాల అప్పలరాజు నియమితులయ్యారు.
కన్న తండ్రే కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన తగరపువలసలో జరిగింది. సీఐ తిరుమలరావు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం...
తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో కోటవురట్ల మండలంలో ఆరు, నర్సీపట్నం, మాకవరపాలెం, కశింకోట మండలాల్లో మూడేసి, రోలుగుంట, బుచ్చెయ్యపేట, ఎలమంచిలి మండలాల్లో రెండేసి, ఎలమంచిలి మునిసిపాలిటీ, నాతవరం మండలాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 23 కేసులు నమోదయ్యాయి.
దీపం-2 పథకం కింద రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైందని జేసీ జాహ్నవి తెలిపారు. జూలై ఒకటో తేదీ వరకు సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అక్టోబరు 29 నుంచి మార్చి 31 వరకు తొలివిడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారి బ్యాంకు ఖాతాల్లో రూ.24,79,82,364 జమ అయ్యాయని తెలిపారు.