Share News

నిండు గర్భిణికి తప్పని డోలీమోత

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:11 AM

మండలంలోని గర్భిణులకు అవస్థలు తప్పడం లేదు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీమోతలపై ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని లంగుపర్తి పంచాయతీ మల్లెపాడు గ్రామానికి చెందిన బిసోయి కాంతమ్మ నిండు గర్భిణి. గురువారం ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనం వచ్చే పరిస్థితి లేదు.

నిండు గర్భిణికి తప్పని డోలీమోత
నిండు గర్భిణి బిసోయి కాంతమ్మను డోలీలో ఆస్పత్రికి మోసుకు వెళుతున్న కుటుంబ సభ్యులు

- ఆరు కిలో మీటర్లు మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు

- మల్లెపాడు గ్రామానికి రహదారి లేక అవస్థలు

అనంతగిరి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గర్భిణులకు అవస్థలు తప్పడం లేదు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీమోతలపై ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని లంగుపర్తి పంచాయతీ మల్లెపాడు గ్రామానికి చెందిన బిసోయి కాంతమ్మ నిండు గర్భిణి. గురువారం ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామం నుంచి డోలీలో ఆరు కిలో మీటర్లు కొండలు, గుట్టలపై నుంచి మోసుకుంటూ లంగుపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:11 AM